News March 21, 2025
బాసర: మానవత్వం చాటుకున్న పోలీసులు

బాసర పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బాసరలోని శారద నగర్ విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఓ అనాథ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ పడిపోయింది. వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే ఆమెను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె కొంతకాలంగా పలు కాలనీల్లో ప్లాస్టిక్ వస్తువులను పోగు చేసి వచ్చిన డబ్బులతో జీవిస్తోందన్నారు.
Similar News
News April 22, 2025
వరంగల్: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్ష ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షల టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.
News April 22, 2025
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు

TG: కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. JEE మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
News April 22, 2025
బాబా ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి: కలెక్టర్

సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగే కార్యక్రమాలను జిల్లా ప్రభుత్వం యంత్రాంగం తరఫున ముందస్తు ప్రణాళికను చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 23న బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారన్నారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.