News April 12, 2025
బాసర: మా సమస్యలు పరిష్కరించండి: ప్రొఫెసర్లు

బాసర RGUKT టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో VC ప్రొఫెసర్ గోవర్ధన్‌కి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 21రద్దు చేయాలని RGUKT స్థాపన నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. TS ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ పోస్టులను నియమించాలని జీవో NO 21 తీవ్ర ఆందోళనలకు గురవుతున్నామన్నారు. తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్‌కు వెళ్లాలన్నారు.
Similar News
News December 3, 2025
4న మన్యంలో మంత్రి లోకేశ్ పర్యటన

మంత్రి నారా లోకేశ్ ఈనెల 4న భామిని మండలంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకోనున్నారు. 7 నుంచి 9 గంటల వరకు భామినిలో టీడీపీ కార్యకర్తలతో ముఖా ముఖిలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి బస చేసి మరుసటి రోజు స్థానిక ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్&టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.
News December 3, 2025
49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్స్టిట్యూట్లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://socialjustice.gov.in
News December 3, 2025
కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో X(ట్విటర్)లో 10 మిలియన్ల(కోటి) ఫాలోవర్లను కోల్పోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. నవంబర్‌లో 115M ఫాలోవర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 105Mకు చేరింది. దీనికి ప్రధాన కారణం ఫేక్ అకౌంట్ల తొలగింపేనని తెలుస్తోంది. అటు NOV 18న ట్రంప్‌తో రొనాల్డో భేటీ ప్రభావం చూపించి ఉండొచ్చని సమాచారం. ట్రంప్ అంటే నచ్చని వారికి వారి మీటింగ్ కోపం తెప్పించిందని తెలుస్తోంది.


