News April 12, 2025
బాసర: మా సమస్యలు పరిష్కరించండి: ప్రొఫెసర్లు

బాసర RGUKT టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో VC ప్రొఫెసర్ గోవర్ధన్‌కి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 21రద్దు చేయాలని RGUKT స్థాపన నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. TS ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ పోస్టులను నియమించాలని జీవో NO 21 తీవ్ర ఆందోళనలకు గురవుతున్నామన్నారు. తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్‌కు వెళ్లాలన్నారు.
Similar News
News February 11, 2026
పాలమూరు: నేడే మున్సి‘పోల్’.. కాసేపట్లో..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగింది. మరికాసేపట్లో (ఉదయం 7 గం.) పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 373 డివిజన్, వార్డులకు పోలింగ్ జరగనుంది. ఓటర్ల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 632 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల విధుల్లో మొత్తం 6,234 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
News February 11, 2026
జిల్లాలో 1170 టీబీ కేసులు: HNK డీఎంహెచ్ఓ

జిల్లాలో 1170 టీబీ కేసులు గుర్తించినట్లు HNK డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 1,98,000 మంది వలనరబుల్ జనాభాకు గాను 1,82,359 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో 1,170 కొత్తగా టీబీ కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే 511 న్యూట్రిషన్ కిట్‌లు అందించినట్లు పేర్కొన్నారు.
News February 11, 2026
RR: ఒక ఓటుతో తారుమారు కావచ్చు.. ఓటేయండి

ఐదేళ్లకోసారి తమను పరిపాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు రూపంలో లభిస్తుంది. ఒక్క ఓటే కదా, వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే పెద్దతప్పు చేసినట్లే. ఎన్నికల ఫలితాల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల బాగోగులు పట్టించుకునేవారికి పదవి కట్టబెట్టి, మాయమాటలు చెప్పేవారికి బుద్ధి చెప్పే విలువైన వజ్రాయుధం ఓటు అని అందరూ గుర్తించాలి.


