News January 31, 2025

బాసర : వసంత పంచమికి ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలి

image

వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం బాసరలో పర్యటించిన కలెక్టర్ వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి పుష్కర ఘాట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కర ఘాట్ ప్రదేశంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలన్నారు.

Similar News

News November 7, 2025

వనపర్తి డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు బదిలీ

image

వనపర్తి జిల్లా వైద్యాధికారి (DMHO) శ్రీనివాసులును ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయనకు నారాయణపేట జిల్లా వైద్య కళాశాల సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా పదోన్నతి కల్పించారు. ప్రోగ్రాం అధికారి సాయినాథ్ రెడ్డిని ఇన్చార్జి జిల్లా వైద్యాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News November 7, 2025

నెక్లెస్‌ రోడ్ ప్రాజెక్ట్..రాజభవన ద్వారం కూల్చివేతకు సిద్ధం

image

HYDలో 1892లో నిర్మించబడిన ఒక రాజ భవనం ద్వారం రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టు కారణంగా త్వరలోనే అదృశ్యమవనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భవనం ముందు భాగం మాత్రమే తొలగించనున్నప్పటికీ హుస్సేన్‌సాగర్ సరస్సును ఎదురుగా చూసే మరో చారిత్రక కోట బురుజు కూడా కూల్చివేయనున్నారు. నెక్లెస్‌ రోడ్‌ను రసూల్‌పుర రోడ్‌తో కలిపే ఈ రహదారి ప్రాజెక్టు కారణంగా నగరంలోని ఈ రెండు చారిత్రక నిర్మాణాలు త్వరలోనే చరిత్రలో భాగమవనున్నాయి.

News November 7, 2025

నిర్మల్: అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం జిల్లాలో అర్హులైన దివ్యాంగులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), ఇన్ఛార్జ్ డీడబ్ల్యూవో ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం కార్యాలయం పనివేళల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.