News February 3, 2025
బాసర: వసంత పంచమి విశిష్టత ఇదే

వసంత పంచమి ఏడాదిలో వచ్చే అత్యంత పర్వదినం. సాక్షాత్తు సకల జీవకోటికి జ్ఞాన ప్రధాయిని అయిన సరస్వతి మాత జన్మదినం. చదువుల తల్లి జయంతిని చిన్నారులకు అక్షర శ్రీకారం జరిపిస్తే విజ్ఞానవంతులు అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ విశిష్టమైన రోజు తమ చిన్నారులకు ఓనమాలు దిద్దించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తారు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమపిల్లలకు బాసర అమ్మసన్నిధిలో పూజలు జరిపిస్తారు.
Similar News
News November 28, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ WARNING

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.
News November 28, 2025
KNR: BC కోటా.. ఎవరికి వారే యమునా తీరే..!

BC రిజర్వేషన్ల సాధనలో రాష్ట్రంలోని BC సంఘాల నేతల మధ్య ఐక్యత కొరవడింది. సమష్టిగా ఉద్యమిస్తే పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసేదన్న అభిప్రాయం BCల్లో వ్యక్తమవుతోంది. కాగా క్రెడిట్ కోసమే BC సంఘాలు వేర్వేరుగా ముందుకెళ్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అటు కృష్ణయ్య, ఇటు జాజుల శ్రీనివాస్.. ఎవరి JAC వారే పెట్టుకొని GO 46పై ఉద్యమించాలని పిలుపునిచ్చినా ఉమ్మడి KNR BC నేతలెవ్వరూ పట్టించుకోవట్లేదు.


