News September 10, 2025
బాసర: విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి

బాసర ట్రిపుల్‌ఐటీలో రూ.1.5 కోట్ల నిధులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. విద్యార్థులను పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో తమకు సరైన లాప్‌టాప్‌లు లేవన్నారు. క్రీడాల కోసం హాకీ, క్రికెట్ గ్రౌండ్‌లో నీరు నిండుతున్నాయన్నారు. మంత్రి స్పందించి NREGS నిధులతో మరమ్మతులు చేయించాలని వీసీ గోవర్ధన్‌ను ఆదేశించారు.
Similar News
News March 4, 2026
2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.
News March 4, 2026
పాలమూరు: చెరువులో విద్యార్థి గల్లంతు

షాద్‌నగర్ పరిధిలోని మహాత్మాజ్యోతిబాఫులే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్న రాజు అనే విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హోలీ ఆడి సరదాగా స్నానానికి చెరువుకు వెళ్లాడు. గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందిన వాడిగా గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 4, 2026
ఖమ్మం: అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్

ఖమ్మం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తోంది. ఇప్పటికే కారేపల్లి, నేలకొండపల్లి, పాలేరు పరిధిలోని 4 కేంద్రాలకు కనెక్షన్లు ఇచ్చినట్లు ఎస్.ఈ శ్రీనివాసచారీ తెలిపారు. చిన్నారుల సౌకర్యార్థం ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ లేని మిగిలిన కేంద్రాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన వైరింగ్ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.


