News April 9, 2025
బాసర RGUKTలో 41 మంది కాంట్రాక్టు అధ్యాపకుల రాజీనామా

ప్రభుత్వ GO21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న 41మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదనపు బాధ్యతలను చేయలేమంటూ ఆ బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా లేఖను ఏవో రణధీర్‌కు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్, పరిపాలన బాధ్యతలతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఊరుకోమన్నారు.
Similar News
News February 26, 2026
పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.
News February 26, 2026
IND Vs ZMB: గెలిస్తేనే సెమీస్ రేసులో ఇండియా

T20 WC S-8లో భాగంగా నేడు 2 కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు చెన్నైలో భారత్, జింబాబ్వే ఢీకొంటాయి. తొలి మ్యాచ్‌లో SA చేతిలో ఓడిన ఇండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో మంచి నెట్ రన్ రేట్‌తో గెలవడం తప్పనిసరి. లేదంటే రేసు నుంచి దాదాపు తప్పుకొన్నట్లే. అటు వెస్టిండీస్, SA ఇప్పటికే చెరో విజయంతో పాయింట్ల పట్టికలో ముందున్నాయి.
News February 26, 2026
కాలం చెల్లిన పదార్థాలు వాడొద్దు: కలెక్టర్

విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు.


