News June 17, 2024

బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

image

ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఘర్షణ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News November 18, 2025

ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

image

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్‌ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్‌లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.