News November 6, 2024
బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News December 14, 2024
NZB: ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్: మంత్రి హెచ్చరిక
సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.
News December 14, 2024
NZB: కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం: మంత్రి
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ, రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు.
News December 14, 2024
ఎత్తిపోతల పనులకు నిధులు విడుదల చేయండి: ఆర్మూర్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(SRSP) పై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల నిర్మాణం, మరమ్మతుల పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.