News June 13, 2024
బిక్కనూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బిక్కనూరులో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఆకుల నర్సింలు (56) నిన్న బుధవారం చేపల వేటకై బొబ్బిలి చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈతరాక మృతి చెందాడు. కాగా ఇవాళ మృతదేహం బయటకు తేలింది. మృతుడి భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 10, 2024
కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత
ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.
News September 10, 2024
జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం
నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 10, 2024
NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.