News January 28, 2025
బిక్కనూరు: బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు: షబ్బీర్ అలీ

భిక్కనూరు మండల కేంద్రం నుంచి సిద్ధిరామేశ్వర ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం రూ.70 లక్షల ఎంఆర్ఆర్ గ్రాంటు మంజూరు చేసినట్లు వివరించారు. త్వరలోనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మండల కేంద్రం నుంచి దేవాలయం వరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులుగా ఉండడంతో నిధులు మంజూరు చేశామన్నారు.
Similar News
News December 19, 2025
KNR: జనరల్ స్థానాల్లోనూ BCల వి’జయ’కేతనం

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,223 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించారు. కాగా, వీటిల్లో 308 స్థానాలు బీసీలకు కేటాయించారు. అయితే 573 జనరల్ స్థానాల్లో 374 మంది బీసీ అభ్యర్థులు గెలవడంతో మొత్తం 682 మంది బీసీ అభ్యర్థులు గెలిచారు. ఈ లెక్కన 55.76% మంది బీసీ అభ్యర్థులు గ్రామపాలకులు కానున్నారు.
News December 19, 2025
రుద్రంగి మండలాన్ని వణికిస్తున్న చలి

గడిచిన 24 గంటల్లో రుద్రంగి మండలంతో పాటు బోయినపల్లి మండలంలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రుద్రంగిలో 9.9°c, బోయిన్పల్లిలో 10.0°c డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వేములవాడ రూరల్ 10.4°c, ముస్తాబాద్ 11.2°c, గంభీరావుపేట 11.2°c, చందుర్తి 11.2°c, వీర్లపల్లి 11.2°c, ఎల్లారెడ్డిపేట 11.5°c, కొనరావుపేట 12.2°c, సిరిసిల్లలో 12.2°cగా
ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది.
News December 19, 2025
నెల్లూరు: 21 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో 21 నుంచి 23వ తేదీ వరకు 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో కార్యక్రమం జరగనుంది. 2.94 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2396 పోలియో బూత్లలో వీరికి చుక్కలమందు వేయనుండగా.. 403 హై రిస్క్ ఏరియాలు, 82 మొబైల్ బూత్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేకంగా బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


