News July 16, 2024
బిక్కనూర్లో ఆగి ఉన్న లారీ ఢీకొన్న కారు

కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్లోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు, మిగతా నలుగురు నిర్మల్కి చెందిన వారిగా గుర్తించారు.
Similar News
News November 17, 2025
NZB: లోక్ అదాలత్లో 4,898 కేసుల పరిష్కారం

గత నెల రోజుల నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 4,898 కేసులు పరిష్కారమైనట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, సైబర్ క్రైమ్కు గురైన బాధితులకు రూ.20,96,406 మొత్తాన్ని తిరిగిచ్చేలా చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు.
News November 15, 2025
NZB: ప్రభుత్వ సలహాదారుని కలిసిన ఉద్యోగ సంఘాలు

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
News November 15, 2025
నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

నిజామాబాద్లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.


