News February 10, 2025

బిక్కనూర్‌లో టీ బ్రేక్ తీసుకున్న త్రిపుర గవర్నర్

image

బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని ఓ హోటల్ వద్ద సోమవారం త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి ఆగారు. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తుండగా హోటల్ వద్ద కొద్దిసేపు ఆగి టీ తాగారు. హోటల్ యజమాని రవీందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Similar News

News December 3, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.

News December 3, 2025

వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ టాప్

image

TG: వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో పంజాబ్ ఉండగా.. తెలంగాణ అధిగమించింది. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7%కు పెరిగింది. వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, అన్నదాతలకు అందిస్తోన్న ప్రోత్సాహకాల వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది.

News December 3, 2025

ఇప్పుడే విచారించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈ మధ్యాహ్నం అన్ని పిటిషన్లు పరిశీలించాక తేదీ ప్రకటిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌‌లో పిటిషన్లు దాఖలు చేయగా స్టే విధించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.