News February 10, 2025
బిక్కనూర్‌లో టీ బ్రేక్ తీసుకున్న త్రిపుర గవర్నర్

బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని ఓ హోటల్ వద్ద సోమవారం త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి ఆగారు. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తుండగా హోటల్ వద్ద కొద్దిసేపు ఆగి టీ తాగారు. హోటల్ యజమాని రవీందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News April 13, 2026
GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే!

సీఎం చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటలకు ఆయన తన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్టీజీఎస్ (RTGS) పనితీరుపై అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత సాయంత్రం 5:50 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.
News April 13, 2026
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News April 13, 2026
నేడు దద్దరిల్లనున్న హైదరాబాద్

ఆరెంజ్ ఆర్మీ అంటే SRH ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతిభ కనబరిచే క్రికెటర్లను అభిమానించే మనసులవి. ‘మేము SRH అభిమానులమే కానీ.. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ విధ్వంసం చూసేందుకైనా నేడు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలి’ అని SMలో పోస్టులు చేస్తున్నారు. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న 2 జట్ల మెరుపులతో సా.7:30 తర్వాత నగరం దద్దరిల్లనుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


