News November 12, 2024

బిక్కనూర్: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

image

బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 10, 2024

NZB: జిల్లాలో 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా

image

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని వివరించారు

News December 10, 2024

NZB జిల్లా ఆసుపత్రి పైనుంచి దూకి వ్యక్తి సూసైడ్

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరం ప్రాంతానికి చెందిన చాట్ల లక్ష్మణ్ (50) అనారోగ్య సమస్యతో 4 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆసుపత్రి భవనం పైఅంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు 1 టౌన్ SHO రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 10, 2024

ఎల్లారెడ్డి: చిరుత దాడిలో దూడ మృతి?

image

ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత దాడిలో దూడమృతి చెందినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గెదేలతో పాటు దూడను వ్యవసాయ బావి వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి బావి వద్దకు వద్దకు వచ్చి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో గేదె మృతి చెందిందని సత్యనారాయణ ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు పంచనామ నిర్వహించారు.