News March 12, 2025
బిక్కనూర్: కంటి అద్దాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

దృష్టి లోపం ఉన్న వారు కంటి అద్దాలు వాడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివప్రసాద్, కంటి వైద్యాధికారి రవీందర్ ఉన్నారు.
Similar News
News January 4, 2026
విశాఖ: జలాంతర్గామిని సందర్శించిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. నౌకా దళంలో కీలకంగా ఉన్న INS హిమగిరితోపాటు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని పరిశీలించారు. దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా సాధిస్తున్న పురోగతికి ఈ నౌకలు ప్రతీకలని గవర్నర్ ప్రశంసించారు.
News January 4, 2026
నిజామాబాద్: 102 కేసులు నమోదు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
News January 4, 2026
APలో ఆ ప్రాజెక్టుని ఆపేందుకు తెలంగాణ ప్రయత్నాలు

TG: గోదావరి నదిపై AP చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ రేపు విచారణకు వస్తోంది. ఈ నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని, ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపేలా చూడాలని సూచించారు.


