News April 11, 2025

బిక్కనూర్: కుటుంబ కలహాలతో సూసైడ్

image

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన నర్సింలు తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. నర్సింలు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది: రాజ్‌నాథ్

image

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉన్నత విద్యావంతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. <<18265346>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్ఞానంతోపాటు విలువలు, వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పారు. విద్య ఉద్దేశం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, కార్యక్టర్‌ను అభివృద్ధి చేసుకోవడమని చెప్పారు.

News January 3, 2026

TU: ఈ నెల 16 నుంచి B.Ed, B.P.Ed 1,3 వ సెమిస్టర్ పరీక్షలు

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.Ed, B.P.Ed 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 29 వరకు జరగనుండగా 3 వ సెమిస్టర్ 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. అటు B.P.Ed 1, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 వరకు జరగనున్నాయి. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు.

News January 3, 2026

వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

image

అంతర్జాతీయ క్రికెట్‌కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.