News April 11, 2025
బిక్కనూర్: కుటుంబ కలహాలతో సూసైడ్

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన నర్సింలు తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. నర్సింలు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2026
శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు

శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 గంటలు రాకపోకలకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 3వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News February 13, 2026
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాకుంటే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘విశ్వేశ్వర’’

విశ్వం అంటే అనంతమైన బ్రహ్మాండం. ఈశ్వర అంటే పాలకుడు. ఈ సృష్టిలోని ప్రతి అణువుకూ, ప్రతి జీవికీ శివుడే ఆధారం. కాలాతీతుడైన ఆయన సమస్త లోకాలను శాసిస్తాడు. కాశీలో ఆయన ‘విశ్వేశ్వరుడు’గా కొలువై భక్తులకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో ఆయన తారక మంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ కాబట్టి ఆయన ‘విశ్వేశ్వరుడు’.


