News February 9, 2025
బిక్కనూర్: గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసే రిమాండ్కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు జంగంపల్లి రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకులను బానిస చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News November 25, 2025
కొడంగల్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో దాని వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన హన్మయ్య(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 25, 2025
అన్నమయ్య: నెరవేరిన సీఎం హామీలు

అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం(M) దేవగుడిలో ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటించారు. కొందరి బంగారు రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆదేశాలతో కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించారు. DMF–CSR నిధుల నుంచి రూ.6.70 లక్షలు విడుదల చేశారు. మాలేపాటి హేమలత రూ.75వేలు, మాలేపాటి ఈశ్వర రూ.1.26లక్షలు, ముంతాజ్ బేగానికి రూ.4.69లక్షల చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు.
News November 25, 2025
ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం


