News March 11, 2025
బిక్కనూర్: ‘గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వేగవంతం చేయాలి’

బిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐలు ఆంజనేయులు, పుష్పరాజ్, స్రవంతి, ప్రభాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
ఈ జపనీస్ టెక్నిక్‌తో హెల్తీ స్కిన్

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్‌తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.
News September 15, 2025
మేడ్చల్: కలెక్టరేట్ ముందు CPI(M) నాయకుల ధర్నా

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అర్హులందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు దివ్యాంగులకు రూ.6 వేలు, ఇతరులకు రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ వద్ద సీపీఐ (ఎం) నాయకులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
News September 15, 2025
పీసీఓఎస్‌తో తగ్గుతున్న ప్రతిస్పందన వేగం

ప్రస్తుతం చాలామంది మహిళలు PCOSతో బాధపడుతున్నారు. వీరిలో షుగర్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. అయితే PCOS బాధితుల్లో ప్రతిస్పందన వేగం తగ్గుతున్నట్లు IITబాంబే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఏకాగ్రత తగ్గడం, నెమ్మదిగా స్పందించడం PCOS బాధితుల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్ హెచ్చుతగ్గులతో మెదడు కణజాలం ప్రభావితమై కాగ్నిటివ్ హెల్త్ దెబ్బతింటున్నట్లు తెలిపారు.