News February 12, 2025
బిక్కనూర్: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345160730_51904015-normal-WIFI.webp)
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో వెలుగుచూసింది. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బొబ్బిలి చెరువులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు చెరువు వద్ద పరిశీలించగా కుళ్లిన మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు చెట్టపల్లి రాజశేఖర్‌గా గుర్తించారు.
Similar News
News February 12, 2025
‘సింగిల్ విండో పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372169605_51916297-normal-WIFI.webp)
సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించాలని మహబూబ్ నగర్ పీఎసీఎస్ ఛైర్మన్లు డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఎసీఎస్ చైర్మన్లు మాట్లాడుతూ సర్పంచులు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ల పాలకవర్గం ముగియగానే అధికారుల పాలన మొదలవుతుందని, అధికారుల పాలనలో కంటే ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను కొనసాగిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
News February 12, 2025
సామాజిక భద్రత పథకాలలో ప్రజలకు చేర్చండి: శివేంద్ర ప్రతాప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739371752261_51916297-normal-WIFI.webp)
జిల్లాలోని ప్రజలందరినీ సామాజిక భద్రతా పథకాలలో చేర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బ్యాంకులను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో శిల్పారామంలో జరిగే మన మహబూబ్‌నగర్ మహా నగరోత్సవం మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News February 12, 2025
సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. అలర్ట్‌గా ఉండండి: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739354187147_52141451-normal-WIFI.webp)
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేయకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.