News March 26, 2025

బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

image

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.

Similar News

News October 24, 2025

సర్వీసు ఇనాం భూములకు త్వరలోనే పరిష్కారం: అనగాని

image

AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇస్తారని, దానిపై CMతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై GOM సమావేశం జరగ్గా అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

News October 24, 2025

పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

image

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్‌ కిసాన్‌’ యాప్ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.

News October 24, 2025

వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ వేతనదారులకు సగటు వేతనం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. అధికారులుతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఫారంపాండ్స్, చెక్‌డ్యామ్‌లు, పశు శాలలు, మ్యాజిక్ డ్రెయిన్స్, మొక్కల నాటే కార్యక్రమాలను నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని, ఏపీడీలు, ఎంపీడీవోలు గ్రామస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.