News March 29, 2025

బిక్కనూర్: బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడి ఎన్నిక

image

రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా సందుగారి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. బిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఆయన బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

మానవత్వం చాటుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వడ్లూర్–ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, గోకుల్ తండా, రామారెడ్డి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. సదాశివనగర్ పోలింగ్ కేంద్రం వద్ద అలసటతో ఉన్న ఒక వృద్ధురాలిని గమనించి, ఎస్పీ స్వయంగా వీల్‌చైర్ అందించారు. రామారెడ్డిలో చిన్న పాపతో ఓటు వేయడానికి వచ్చిన తల్లిని అభినందించారు.

News December 11, 2025

సిద్దిపేట జిల్లాలో తొలి విజయం

image

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాందాపూర్ సర్పంచిగా లింగాల మౌనిక ముత్యం విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నర్రా రవి మీద 321 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

News December 11, 2025

భారతీయులను పంపించడం సిగ్గుచేటు: ట్రంప్

image

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న టాలెంటెడ్ ఇండియన్స్ దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇది సిగ్గుచేటని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన కొత్త “<<18530951>>ట్రంప్ గోల్డ్ కార్డ్<<>>”ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆయన హైస్కిల్డ్‌ స్టూడెంట్స్‌కు ఉద్యోగం ఇచ్చి వారిని అమెరికాలోనే నిలుపుకోవడానికి ఇది కీలకమన్నారు. కంపెనీలు ఈ కార్డ్ కొనుగోలు చేయొచ్చని వివరించారు.