News April 28, 2024

బిక్కనూర్: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

మండల పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామ పరిధిలోగల రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 7, 2024

NZB: చిన్నారిని హత్య చేసిన తల్లితో పాటు మరొకరికి జీవిత ఖైదు

image

మూడేళ్ల కూతురును హత్య చేసిన తల్లితో పాటు మరోవ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్, మోర్తాడ్కు చెందిన కూలీ రజిత అలియాస్ రాధతో సహజీవనం చేస్తూ రాధ కూతురు తమకు అడ్డుగా ఉందని భావించారు. దీనితో 2023లో చిన్నారిని కొట్టి నీటిలో ముంచి చంపినట్లు కేసు నిర్దారణ అయ్యింది.

News November 6, 2024

గవర్నర్‌ను కలిసిన షబ్బీర్ అలీ

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News November 6, 2024

బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.