News February 28, 2025
బిక్కనూర్: వసతి గృహంలో కలెక్టర్ బస

బిక్కనూర్ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అందుతున్న సేవలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, విద్యార్థులతో కలిసి బస చేశారు.
Similar News
News October 31, 2025
ఉమ్మడి కడప మీదుగా ఆలయాలకు ప్రత్యేక రైళ్లు.!

కార్తీకమాసంలో పంచభూత లింగాల దర్శనానికి ఉమ్మడి కడప జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
*కడప నుంచి అరుణాచలం 12794, 12797, 17416, 16381 డైరెక్ట్ రైలు లేదు. తిరుపతి నుంచి వెళ్లాలి.
*చిదంబరం నటరాజ స్వామి కోవెల్ 09419,11017
*జంబుకేశ్వరాలయం 22101, 16351,09419, 16353,
*కంచి ఏకాంబేస్వర దేవాలయం 22101,16351
*శ్రీ కాళహస్తీస్వర ఆలయం 18522 తిరుమల ఎక్స్ప్రెస్
*17261, 17652, 12794, 12797.
News October 31, 2025
శ్రీను హత్యకు ఆ ఆడియోనే కారణమా!

అమలాపురం(M) కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్యకు ఫోన్ కాల్ ఆడియోనే కారణమా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగుమళ్ళ కాసుబాబుతో శ్రీను మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మృతుడు శ్రీను, కాసుబాబు మధ్య జరిగిన వ్యక్తిగత దూషణలు, ఆ ఆడియో వేరే వాళ్లకు పంపడం హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల ఇందుకు మూలంగా భావిస్తున్నారు.
News October 31, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.


