News December 15, 2024
బిగ్‌బాస్ 8 ఫైనల్.. HYDలో భారీ బందోబస్తు

HYD వేదికగా నేడు బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ జరగనుంది. గత సీజన్‌లో ఫైనల్ రోజు జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొన్న పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సెట్టింగ్ చుట్టూ 53 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ప్రత్యేకంగా 300 మందితో బందోబస్తు నిర్వహించాలని వెస్ట్ జోన్ పోలీసులు నిర్ణయించారు.
Similar News
News November 28, 2025
HYD: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు దేశ విదేశాల నుంచి యాభై వేల మందికి పైగా సందర్శకులు హాజరై విశేష స్పందన లభించిందని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో 2 స్థానంలో ఉండడం సంతోషం అన్నారు.
News November 28, 2025
HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్‌లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.