News October 15, 2024
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Similar News
News November 12, 2024
ప.గో. జిల్లాలో రేంజ్ IG పర్యటన
ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
News November 11, 2024
ఏలూరు జిల్లాలో మహిళల కోసం అభయ దళం
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలో మహిళల కోసం నూతనంగా అభయ దళం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల కోసం 95503 51100 టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112కు సమాచారం అందించిన 10 నిమిషాల్లో పోలీసులు మీకు భద్రతను కల్పిస్తూ, మహిళలపై వేధింపులు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News November 11, 2024
విద్య వల్ల ఉజ్వల భవిష్యత్తు సాధ్యం: కలెక్టర్ నాగారాణి
విద్య వల్ల ఉజ్వల భవిష్యత్తు సాధ్యం అని ఆనాడే గుర్తించిన మహనీయుడు మౌలానా ఆజాద్ నుంచి స్ఫూర్తిని పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.