News December 13, 2024

బిచ్కుంద ఐటీఐ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

బిచ్కుంద ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఐటీఐలో అడ్మిషన్ కాకముందు ఏం చదివారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ కాలంలోనే స్వయం ఉపాధి, ఉద్యోగం సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

ఎడపల్లి వాసి నేత్ర దానం

image

ఎడపల్లిలో శుక్రవారం మృతి చెందిన కంటేడి గంగాధర్(60) నేత్ర దానం చేశారు. మృతి చెందిన అనంతరం నేత్రాలను నేత్రదానం చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నేత్రాలను దానం చేశారు. తన మృతి అనంతరం ఇంకొకరికి చూపును ప్రసాదించే సంకల్పంతో నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులకు గంగాధర్ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 17, 2025

నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

image

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 17, 2025

నిజామాబాద్: రేపటి బంద్‌కు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ కవిత

image

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అన్నారు. కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ బంద్‌లో పాల్గొనడం హాస్యాస్పదమని ట్వీట్ చేశారు.