News February 14, 2025
బిచ్కుంద: బస్టాండ్ ఆవరణలో వ్యక్తి మృతి

బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో పుల్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించి చూడగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చాయని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
కొత్తగూడెం: ‘రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు’

మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని చెప్పారు.
News November 25, 2025
BHPL: ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఐడీవోసీలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ నగర్లోని 16 మంది లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గృహాల కేటాయింపు ధ్రువపత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.
News November 25, 2025
సిద్దిపేట: భర్త ఇంటి ముందు భార్య నిరసన

తనను, పిల్లలను వదిలివేరే మహిళతో ఉంటున్నాడంటూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాల్ లక్ష్మి మంగళవారం భర్త రాజు ఇంటి ముందు నిరసనకు దిగింది. వివాహేతర సంబంధం కారణంగా భర్త తనను ఇంట్లో నుంచి గెంటేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. రాజుపై సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది.


