News March 21, 2025

బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

image

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్‌లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్‌లో మనీష్‌కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

IPL: ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RRతో జరిగిన మ్యాచ్‌లో RCB 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(70), దేవదత్ పడిక్కల్(50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 26 పరుగులతో శుభారంభం అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(23), జితేశ్ శర్మ(20*) బౌండరీలతో మెరిపించారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. RR టార్గెట్ 206.

News April 24, 2025

నాయీ బ్రాహ్మణుల కమీషన్ పెంపు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి.

News April 24, 2025

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

error: Content is protected !!