News April 4, 2025

బిజినేపల్లిలో ఏప్రిల్ 22న జాతీయ సెమినార్

image

బిజినేపల్లి మండలం పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ సైన్స్ అండ్ ఆర్ట్స్ అటానమస్ కళాశాల ఏప్రిల్ 22న ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. సెమినార్ బ్రోచర్‌ను అధ్యాపకులతో విడుదల చేసిన ఆయన ఈ సెమినార్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులతో నిర్వహిస్తున్నామన్నారు. సెమినార్‌లో పరిజ్ఞానం ఉన్న ఏ టీచరైనా ఈనెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

Similar News

News November 18, 2025

మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.

ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.