News February 14, 2025

బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 13, 2025

ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: హెల్త్ డైరెక్టర్

image

యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడారు. వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆయన అన్నారు.

News September 13, 2025

తాగునీటి చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

image

అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.