News April 19, 2024

బిజినేపల్లి: అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

image

దివ్యాంగ <<13080058>>యువతి పట్ల అసభ్యకరం<<>>గా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి కలెక్టర్ ఉదయ్ కుమార్ సస్పెన్షన్ చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల టీచర్..యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపట్టినట్లు డీఈవో తెలిపారు.

Similar News

News September 20, 2024

రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలి: సిక్తా పట్నాయక్

image

విద్యలో జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.

News September 19, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం..

image

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880.6 అడుగుల వద్ద 191.2118 టీఎంసీలుగా ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తంగా జలాశయానికి 21,879 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. భూగర్భ కేంద్రం, ఏపీ జెన్కో పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 67,156 క్యూసెక్కుల నీటిని వినియో గిస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 16.879 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.697 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.

News September 19, 2024

జూరాలకు స్వల్ప వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అతి స్వల్పంగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి 18, 500 క్యూసెక్కులు మాత్రమే ఉన్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తికి 15,120 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 18,385 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది.