News March 26, 2025
బిజినేపల్లి: ఈనెల 27న ఉద్యోగమేళా

బిజినేపల్లి మండల పరిధి పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఉ:10 గంటల నుంచి జాబ్ మేళా ఉంటుందని, జిల్లాలోని 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, డిప్లమా పాసైన 33 ఏళ్లలోపు వయసున్న యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
కరీంనగర్: ఈ రెండు గ్రామాలకు ఎన్నికలు లేవు..!

KNR(D) సైదాపూర్(M) రామచంద్రాపూర్, కురుమ పల్లె గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో రెండు గ్రామాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు హైకోర్టులో తుది తీర్పు వెలువడలేదు.
News November 27, 2025
HYD: చేతిరాత బాగుంటుందా?

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.


