News January 17, 2025
బిజినేపల్లి: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: భాస్కర్

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్, పరిశీలకులకు బిజినేపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 సీట్లకుగాను ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 6,602 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈనెల18న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.
News November 30, 2025
ALERT: ప్రజావాణి రద్దు: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
News November 30, 2025
MBNR: నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసేందుకు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డి.జానకి కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో విడత నామినేషన్ కేంద్రాలైన కోయిలకొండ, సంగినోని పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్, శేరివెంకటపూర్, సూరారం, ఖాజీపూర్ గ్రామాలను వరుసగా సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సై తిరుపాజి పాల్గొన్నారు.


