News May 11, 2024

బిజినేపల్లి: భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

image

అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. సంఘనమోని వెంకటయ్య రెండో భార్య తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెద్దల సమక్షంలో పలుమార్లు విన్నవించిన తీరు మారకపోవడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య(45) తారకమ్మ(34)ను నిద్రిస్తుండగా తలపై బండ రాయితో కొట్టి హత్యచేశాడు. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 10, 2025

16న జైపాల్ రెడ్డి జయంతికి ఏర్పాట్లు 

image

ఈ నెల 16న జైపాల్ రెడ్డి 83వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ వద్ద జయంతిని నిర్వహించేందుకు నిర్ణయించారు. జైపాల్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.

News January 10, 2025

MBNR: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: సివిల్ జడ్జి

image

చట్టాలపై అవగాహన పెంచుకుని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మనోన్యాయ్ కమిటీ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పిల్లల చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై పలు సూచనలు చేశారు.

News January 9, 2025

MBNR: మద్దిమడుగు ఆంజన్న రూ.14 కోట్ల ఆస్తిపరుడు

image

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి రూ.14 కోట్లకు ఆస్తిపరుడు. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.14 కోట్లు దేవుడి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు ఈవో రంగాచారి వెల్లడించారు. ఆ మొత్తానికి వచ్చిన వడ్డీని సైతం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చేస్తున్నామని తెలిపారు.