News August 10, 2024
బిజినేపల్లి: భార్యను విడిపించాలని భర్త వేడుకోలు
నా. కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంకి చెందిన తప్పేట రాములు, భార్య ఎల్లమ్మ కొంతకాలంగా అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రి రామస్వామి దగ్గర వలస కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుమారునికి ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన మేస్త్రి పంపకపోవడంతో రాములు పారిపోయి వచ్చాడు. విషయం తెలుసుకున్న మేస్త్రి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వనిదే భార్యను పంపనని వేధిస్తున్నట్లు రాములు చెప్పారు.
Similar News
News September 15, 2024
MBNRలో ఐటీఐ, జూ.కళాశాల, పీహెచ్సీకి జీవో జారీ
నియోజకవర్గంలోని హకీంపేట్‌లో ఐటీఐ, జూ.కళాశాల, పీహెచ్సీ, 8 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసిందని కడా ప్రత్యేక అధికారి కె.వెంకట్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌ను విద్యాహబ్‌గా మార్చేందుకు సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే మెడికల్, పశువైద్య కళాశాలలు, గురుకుల సమీకృత భవనాలు, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.
News September 15, 2024
MBNR: షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే
మహబూబ్‌నగర్ పట్టణంలో షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే చేపట్టినట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి బి.చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. మాల్స్, రైల్వే కార్మికుల్లో నాన్ ఎంప్లాయిమెంట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.
News September 15, 2024
MBNR: వెంకన్న సన్నిధిలో కలెక్టర్ సంతోష్
బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నాగర్‌కర్నూలు కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు స్వాగతం పలుకగా, అర్చకులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ పరిసరాలను 2గంటల పాటు పరిశీలించారు.