News February 12, 2026
బిజినేపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి బాలుడు ఉపేందర్(15) అక్కడికక్కడే మృతి చెందాడు. నీటి పైపు ఊడిపోవడంతో దానిని సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడని స్థానికులు తెలిపారు. తండ్రి గతంలోనే మరణించగా, ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన కుమారుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరవుతున్నారు.
Similar News
News March 11, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ డైరెక్టర్‌గా సుబాసిస్ సేన్ గుప్తా

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సుభాసిస్ సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పురుషోత్తం పదవీ విరమణ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 12 మందిలో ఆయనను ఎంపిక చేశారు. వచ్చే నెలలో సుభాసిన్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అక్కడే 9 ఎకరాల్లో లేఅవుట్ చేసి 311 మంది బాధితులకు 75 గజాల చొప్పున పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నేడు పట్టాల పంపిణీ చేపట్టనుంది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజీ ఇస్తుందో వేచి చూడాలి.


