News February 6, 2025
బియ్యం అక్రమరవాణా తగదు: జేసీ అభిషేక్ కుమార్

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని సివిల్ సప్లై, డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర సరకుల పంపిణీలో ఎలాంటి అక్రమ లావాదేవీలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్‌కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య(55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


