News February 26, 2026

బిల్డింగులు కట్టుకునేవారికి అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

image

ఇంటిపన్ను చెల్లించేవారు, కొత్త బిల్డింగులు కట్టుకునేందుకు పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీ నిర్వహించారు. జీఎస్టీ రెవెన్యూ పెంచడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పని చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

image

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ధి, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.

News April 14, 2026

ADB: పెళ్లి సంబరాలు కావద్దు విషాదం..!

image

ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లిల జోరు కొనసాగుతోంది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సామూహికంగా వెళ్తుంటారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి లారీలు, ట్రాక్టర్లు వంటి వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల సిరికొండ మండలానికి చెందిన వాహనం నిర్మల్ సమీపంలో ప్రమాదానికి గురై ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.