News June 30, 2024

బిల్లులు చెల్లించకుంటే కోర్టుకు వెళ్తాం: MLC తూమాటి

image

రెండేళ్ల కిందటి బిల్లులు ఇంకా ఇవ్వకుంటే ఎలా అని స్థానిక సంస్థల MLC తూమాటి మాధవరావు RWS ఎస్ఈ మర్దన్ అలీని ప్రశ్నించారు. ఒంగోలులో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులను ఆపాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని, కొత్త అధికారులు రాకముందే బిల్లులు చెల్లించే విధంగా చూడాలన్నారు. బిల్లుల విషయంలో కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తాం అన్నారు.

Similar News

News November 26, 2025

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

image

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.

News November 26, 2025

నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టు పరిధిలో అవినీతి కార్యకలాపాలకు పలువురు సిబ్బంది పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ప్రాజెక్టు పరిధిలో జరిగిన అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

News November 26, 2025

త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.