News June 30, 2024
బిల్లులు చెల్లించకుంటే కోర్టుకు వెళ్తాం: MLC తూమాటి
రెండేళ్ల కిందటి బిల్లులు ఇంకా ఇవ్వకుంటే ఎలా అని స్థానిక సంస్థల MLC తూమాటి మాధవరావు RWS ఎస్ఈ మర్దన్ అలీని ప్రశ్నించారు. ఒంగోలులో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులను ఆపాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని, కొత్త అధికారులు రాకముందే బిల్లులు చెల్లించే విధంగా చూడాలన్నారు. బిల్లుల విషయంలో కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తాం అన్నారు.
Similar News
News October 11, 2024
ప్రకాశం: మద్యం దరఖాస్తులు అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ
ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అధికార వెబ్‌సైట్ ప్రకారం.. కనిగిరి రూరల్‌లోని షాప్ నంబర్ 123కు అత్యల్పంగా 4 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా చీమకుర్తి రూరల్‌లోని షాప్ నంబర్ 58కి 43మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ షాపునకు రూ.కోటీ 16 లక్షలు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News October 11, 2024
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో గొట్టిపాటి లక్ష్మీ భేటీ
రాష్ట్ర ట్రాన్స్ పోర్టు & స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్శి TDP ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలోని మినీ స్టేడియం ఇతరత్రా అంశాలపై మంత్రికి ఆమె వివరించారు. దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం మంత్రికి గౌతమ బుద్ధుడి ప్రతిమ బహూకరించారు.
News October 11, 2024
అద్దంకి: అమ్మవారికి 50 కిలోల లడ్డు సమర్పణ
అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.