News November 16, 2024
బి.కొత్తకోట: క్షుద్రపూజలు చేస్తున్న వైసీపీ నేతలు అరెస్ట్
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏ.వీ సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కరరెడ్డి ఉన్నారు. బి.కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో పూజలు నిర్వహించగా అరెస్టుచేశామని తెలిపారు.
Similar News
News December 7, 2024
అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.
News December 7, 2024
‘రూ.200 కోట్లు విలువైన భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారు’
రూ.200కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని మదనపల్లెకు చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాల్ నాయుడు దంపతులు ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన కట్టా సులోచనను పెద్దిరెడ్డి బినామీగా పెట్టి మదనపల్లెకు చెందిన 15 కుటుంబాలకు చెందిన భూమికి కబ్జా చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
News December 7, 2024
టీటీడీ చైర్మన్‌ను కలిసిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు
టీటీడీ చైర్మన్‌ను శాప్ ఛైర్మన్ రవినాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస స్పోర్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ, హాకీ అకాడమీ పునరుద్ధరణకు టీటీడీ తరపున సహాయ సహకారం అందించాలని చైర్మన్‌ను కోరుతూ రవినాయుడు వినతిపత్రం ఇచ్చారు. రవినాయుడు వినతిపై టీటీడీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు, క్రీడాకారులకు ఉపయోగకరంగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఛైర్మన్ ఇచ్చారన్నారు.