News March 19, 2024
బి.కొత్తకోట: ప్రియుడుతో కలిసి తండ్రిని హత్య చేయించిన కూతురు

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి కూతురే తండ్రిని హత్య చేయించిందని ములకలచెరువు ట్రైనీ DSP ప్రశాంత్ తెలిపారు. మండలంలోని మొరవపల్లి వద్ద కోళ్లఫారంలో వారం క్రితం టీడీపీ నేత రాజారెడ్డిని దారుణంగా హత్యగురైన విషయం తెలిసిందే. కాగా సోమవారం హత్యకేసులో నిందితులైన కూతురు బ్రాహ్మణి, ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు.
Similar News
News February 12, 2026
హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తాం: చిత్తూరు SP

జరిమానాల ద్వారా కాకుండా అవగాహన ద్వారా హెల్మెట్ వినియోగం పెంచేలా కృషి చేస్తామని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఆటోలపై వాటిని అతికించారు. రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదాలలో ఎక్కువ భాగం బైక్, ఆటోలే కారణం అవుతున్నాయని చెప్పారు.
News February 12, 2026
చిత్తూరు: 17న ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి..!

చిత్తూరు జిల్లాలో ఈనెల 17 నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. జిల్లాలో 1-19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1-5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 2,84,060 మందికి.. బడి బయట ఉన్న1157 మందికి మాత్రలు అందిస్తామన్నారు.
News February 12, 2026
చిత్తూరు జిల్లాలో మీకు ఈ విషయం తెలుసా?

కంగి, కంగడు అనే బందిపోటు దొంగలు 1066-1132 మధ్య కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. దట్టమైన అరణ్యంలో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపేలా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత జమీందారుల పాలన కొనసాగుతూ 1950 వరకు సుమారు 884 ఏళ్లు ఈ కోట రాజధానిగా ఉండేది.


