News May 19, 2024

బి.మఠం: భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

image

బ్రహ్మంగారిమఠంలో ఘోర ప్రమాదం జరగగా, ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇంద్ర బాబు తన సతీమణి విజయలక్ష్మితో కలిసి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలను చూడడానికి శుక్రవారం మఠం వచ్చారు. రాత్రి ఓ అన్నదాన సత్రం వద్ద పడుకుని ఉండగా హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ కారు ఆన్ లో ఉంచి కిందకు దిగాడు. కారులో ఉన్న బాలుడు గేర్ వేయడంతో కారు ఇంద్ర బాబుపైకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News January 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

News January 10, 2026

గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

image

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్‌లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.

News January 10, 2026

యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

image

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.