News April 24, 2024
బీఆర్ఎస్‌కు మనస్తాపంతో రాజీనామా చేశా: మాజీ ఎమ్మెల్యే

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక సమస్యలపై తమ వంతుగా కృషి చేశానని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాలతో తనకు గుర్తింపు లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైరాలో ఆయన సంబంధించిన వర్గీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అనేకమంది నాయకులు ప్రజాప్రతినిధులు రాములు నాయక్ మద్దతుగా నిలిచారు.
Similar News
News November 24, 2025
ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
ఖమ్మం జిల్లాలో లక్ష నుంచి 30వేల ఎకరాలకు

ఖమ్మం జిల్లాలో మూడేళ్లుగా మిర్చిసాగు క్రమంగా తగ్గుతోంది. ధర, దిగుమతి లేకపోవడంతో రైతులు విముఖత చూపుతున్నారు.2020లో జిల్లాలో 1,08లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు. 2023లో 92,274, 2024లో 59.205, ఈ ఏడాది 31,741ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3ఏళ్ల క్రితం క్వింటా రూ. 25వేలు పలికింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం రూ. 15వేల లోపే ఉంది. చైనాలో మిర్చిసాగు పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
News November 24, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్‌లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.


