News August 11, 2024

బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు: ఎర్రబెల్లి

image

తాను BRSను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మకూడదని, కార్యకర్తలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

Similar News

News September 10, 2024

మేడారంలో శాశ్వత పనులకు ప్రతిపాదన సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదన సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు.

News September 10, 2024

వరంగల్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

image

వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన చెరువులను, పరిసర ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నందిరాం నాయక్, CI గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

News September 10, 2024

వరంగల్: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,700

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి ధర నిన్నటి లాగే రూ.7,700 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరిగేలా వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.