News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

Similar News

News November 11, 2025

NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్‌

image

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్‌ బస్సులకు సైడ్‌ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News November 10, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ మిర్యాలగూడ: అమానుషం.. కుక్క నోట్లో మృతశిశువు
→ నల్గొండ: ప్రజావాణికి 94 దరఖాస్తులు
→ నార్కట్‌పల్లి: లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్ళారు.
→ నల్గొండ: ఇన్‌చార్జి పాలన ఇంకెనాళ్లు?
→ కట్టంగూర్: ఈ సంతకు 75 ఏళ్ల హిస్టరీ
→ నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ
→ నల్గొండ: MGUకి అరుదైన గౌరవం
→ నాగార్జునసాగర్: ఆయకట్టులో జోరుగా వరికోతలు

News November 10, 2025

నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

image

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.