News March 21, 2024
బీఆర్ఎస్ కు నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు లేదు: మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ నాయకులకు నీళ్లు వదలమని అడిగే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత వర్షాకాల సీజన్ లో వాళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయలేకపోయారని అలాంటప్పుడు ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు వారికి ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలను పూర్తిగా ఎండబెట్టే పరిస్థితికి తెచ్చారని బీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News March 14, 2026
తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.
News March 14, 2026
గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.


