News April 17, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి: మాజీ మంత్రి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 11, 2026
KU: వన దేవతల సేవలకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సిద్ధం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని జిల్లాల నుంచి మేడారం జాతరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది వాలంటీర్లు, 20 మంది ప్రోగ్రాం అధికారులు, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాల్గొననున్నారు. జాతర సందర్భంగా భక్తులకు తాగునీటి పంపిణీ, జంపన్నవాగు వద్ద సేవలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ, మిస్సింగ్ పాయింట్‌లో సహకారం, గద్దెల వద్ద క్యూలైన్ క్రమబద్ధీకరణ వంటి సేవలు చేయనున్నారు.
News January 11, 2026
ఆవు పాలు, గేదె పాలు.. వీటిలో ఏవి మంచివి?

డెయిరీఫామ్ సక్సెస్.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా తాగే పాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ఆవు పాలు తాగే దగ్గర గేదెలతో డెయిరీఫామ్ పెట్టడం వల్ల లాభం ఉండదు. దీన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. అయితే చాలా మంది వినియోగదారుల్లో ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? అనే సందేహం ఉంటుంది. అసలు వీటి మధ్య తేడా ఏమిటి? ఏ మిల్క్ వల్ల ఏ లాభాలుంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 11, 2026
పాలమూరు: బాలుడి ప్రాణం తీసిన బైక్ సరదా

కల్వకుర్తిలో విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు.. గాంధీనగర్‌కు చెందిన రఘుపతి, సునీత దంపతుల కొడుకు సాయి ప్రణీత్(13) నిన్న వరుసకు మామ అయిన వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ బైక్ తాళాలు ఉండటంతో ఎవరికీ చెప్పకుండా స్టార్ట్ చేశాడు. రోడ్డుపై అతివేగంతో వెళ్తూ మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


